నిషిద్దాక్షరాలు 27 జనవరి 2014 11:53 PMకి · దిద్దబడినది · వేకువ కొసం [దీర్ఘ కవిత] ఆవేశం నిండిన నా ఆలోచనలోకో ఆలోచన నిండిన నా అంతరంగం లోకో వొకానొక ఉల్క లాలుతున్నప్పుడు నేను చూసిన అనుభవంనుంచి వొకానొక వాల్కనో పేలుతున్నప్పుడు నేను విన్న అలజడి నుంచి సమాధానం దొరకని సందిగ్దం నుంచి నర్మగర్భ మైన నిశబ్ధాన్ని మోసుకొస్తున్నాను బహుశా.. ఇది నాందీ ప్రస్థానం ***** రెట్టవేయటానికి మించి తెలియని ఒపిట్ట మసీదు గుమ్మటం మీద ఎగిరి ఏ గుడి గోపురానో వాలుతుంది హరం హలాల్ లగురించి తెలీకేనేమో హేరాం యా అల్లాహ్ ల మద్య రెక్కలు తెగి రాలిపోయింది ఇది హందర్ద్ పై హత్యా ప్రయత్నం ఓ మిత్రమా ఈ భగ్న సమాజపు దగ్ధ సంగీతాన్ని మోసుకొచ్చె ఆపిట్టకు మన్మొక సారి మనసారా క్షమాప్ణ చెప్పుకుందాం ఆకలి ప్రేగులు అరచే వేళ అల్లాహ్ అచ్చాహో య నా హో రాముడి రక్షా హో యా నాహో ఆన్నం మెతుకు అరిగి తీరాల్సిందే ఆకలి వేళా అమ్మ తప్ప అన్యులూ గుర్తుకు రారు నేస్తం! ఆదృశ్య దృశ్యాల్నిచూస్తూ అస్తిత్వాన్ని అగాధాల ఫాలు చేసుకోటానికి ఒకరినొకరం వేటాడుకోటానికి వేంటాడు కోటానికి ఒకరు మృగము మరొకరు ఆదిమానవులమూ కాదు కాదా! ఇదొక ఆరని కాష్టం...
Posts
Showing posts from 2015