Posts

ఆజాదీ

Image
 నేను తూటాకు గురిపెట్టిన విసుర్రాయిని స్వప్నిస్తాను అణచివేసే రాజ్యంపై ఆజాదీకోసం ఎత్తిన పిడికిళ్లను స్వాగతిస్తాను పుట్టిన భూమ్మీద ఆజాదీ నిషేదించబడ్డచోట నినాదాలై మొలకెత్తే నిరసన గేయాలకు నేనూ కోరస్ గొంతుకనవుతాను ఒక్కోసారి తత్వం ఇంకోసారి మతం ఇప్పుడు నీలా ప్రాంతం మనుషుల్ని వేరుచేసి   దశాబ్దాలుగా కొనసాగే రక్తసిక్త సందర్బంలో కొన్ని వీరోచిత గాథల్ని రేపటి తరానికి కథలుగా చెప్పాలనుకుంటాను ఓడిపోతున్న జట్టుపక్షాన  మాట్లాడకపోతే  ఒరిగిపోతున్న జాతిపక్షాన బాధని ప్రకటింకపోతే నీ మరణంకూడా వాడ్ని మనిషిగా మార్చలేని సంకల్పిత మౌనం బద్దలయ్యేలా  నేను తుపాకీ తూటాకు గురిపెట్టిన విసుర్రాయినే స్వప్నిస్తాను    Nabi Kareem Khan

దేశద్రోహి

Image
 నా దేశం ఇప్పుడు అడుగడుగునా  స్వేచ్ఛగా తిరగనీయని సరిహద్దు రేఖల్ని గీసుకుంటుంది స్వేచ్ఛగా  స్వచ్ఛందంగా అమాటకొస్తే స్వతంత్రంగా మాట్లాడటం తిరంగా పై తిరుగుబాటు అనే కాలమిది.... కొన్ని కాలాలంతె కన్నీళ్లపై కూడా కూృరత్వాన్నే ప్రదర్శిస్తాయి... కొన్ని రాజ్యాలంతె మతం పునాదుల పైన మనుషుల్ని వేరు చేస్తాయి... కొన్ని ఆశయాలు ఆత్మబలిదానాల్ని కొన్ని ఆలింగనాలు నమ్మకద్రోహుల్ని  కానుకలుగా స్వీకరించాక ఆ దేశపు దేహం మీద ఎగిరే మత చిహ్నపు మరణశాసనానికి చర్చించే గొంతులు ప్రశ్నించే కలాలు వేలాడదీయబడ్తాయి దగాపడ్డ జాతికి దేశభక్తి పాఠాలు నేర్పిస్తు అచ్చేదిన్‌ కలలు చూపిస్తూ చచ్చేదిన్‌ని అమలు పరుస్తుంటాయి.... భయాలు, బాధ్యతలు ప్రశ్నలు, సమాధానాలు అక్షరాలు, అశ్రువులు నిరసనలు, నినాదాలు అన్నీ నిషేధించబడతాయి. రేపటి నాదేశపు నిరసనకారుడికి గుర్తుగా ఉరితాడుకి ఉద్యమం వేలాడబడుతుంది ఒకానొక సందర్భంలో నిరసన కారుడి మరణంపై పిరికితనాన్ని  పులిమేశాక మరణ కారణాలపైన కాక అతని కులంపైనో గుణం పైనో పోస్టుమార్టం నిర్వహించి చివరాఖరకు ప్రకటన వెలువరించబడుతుంది దాని సారాంశం నిరసనకారుడో ఓ దేశద్రోహి... -నబి కరీం ఖాన్
నిషిద్దాక్షరాలు 27 జనవరి 2014 11:53 PMకి  ·  దిద్దబడినది  ·  వేకువ కొసం [దీర్ఘ కవిత] ఆవేశం నిండిన నా ఆలోచనలోకో ఆలోచన నిండిన నా అంతరంగం లోకో వొకానొక ఉల్క లాలుతున్నప్పుడు నేను చూసిన అనుభవంనుంచి వొకానొక వాల్కనో పేలుతున్నప్పుడు నేను విన్న అలజడి నుంచి సమాధానం దొరకని సందిగ్దం నుంచి నర్మగర్భ మైన నిశబ్ధాన్ని మోసుకొస్తున్నాను బహుశా.. ఇది నాందీ ప్రస్థానం ***** రెట్టవేయటానికి మించి తెలియని ఒపిట్ట మసీదు గుమ్మటం మీద ఎగిరి ఏ గుడి గోపురానో వాలుతుంది హరం హలాల్ లగురించి తెలీకేనేమో హేరాం యా అల్లాహ్ ల మద్య రెక్కలు తెగి రాలిపోయింది ఇది హందర్ద్ పై హత్యా ప్రయత్నం ఓ మిత్రమా ఈ భగ్న సమాజపు దగ్ధ సంగీతాన్ని మోసుకొచ్చె ఆపిట్టకు మన్మొక సారి మనసారా క్షమాప్ణ చెప్పుకుందాం ఆకలి ప్రేగులు అరచే వేళ అల్లాహ్ అచ్చాహో య నా హో రాముడి రక్షా హో యా నాహో ఆన్నం మెతుకు అరిగి తీరాల్సిందే ఆకలి వేళా అమ్మ తప్ప అన్యులూ గుర్తుకు రారు నేస్తం! ఆదృశ్య దృశ్యాల్నిచూస్తూ అస్తిత్వాన్ని అగాధాల ఫాలు చేసుకోటానికి ఒకరినొకరం వేటాడుకోటానికి వేంటాడు కోటానికి ఒకరు మృగము మరొకరు ఆదిమానవులమూ కాదు కాదా! ఇదొక ఆరని కాష్టం...
Image
Nabi Kareem Khan బహుశా" నబి కె ఖాన్ మనం ఎప్పుదైతే అతన్నో అంటరానివాణ్ణి చేసి ఊరవతల విసిరేశామో అప్పుడే పునరాలొచించుకోవల్సింది మనం ఎప్పుడైతే అతన్లో అస్పౄస్యపు గాయాల్ని రేపి వివక్ష విత్తుల్ని నాటామో బహుశా అప్పుడు మొలకెత్తిన హరితమే హరిజనం * * * అగ్రహారపు అరుగుల మీద రచ్చబండ రాజకీయంలో అతన్నో పావునుచేసి మనం ప్రకటించిన పంచముడుకదా అచారాల్ని మనం శాసించి అపచారాల్ని అతని ముఖాన పులిమినప్పుడు బహుశా అతను నిద్రిస్తూలేడేమో తనమొలకు కట్టిన తాటాకు చప్పుళ్ళు తనకు ప్రతీక్షణం పారాహుషార్ పలికేవనుకుంటా * * * * ఊరుమ్మడి బావి దగ్గర ఊరే నిళ్ళ సవ్వడిని సైతం మనం చూడనివ్వని చండాలుడు కదా అప్పుడు చెమ్మగిళ్ళిన కళ్ళే చైతన్యాన్ని వెతుక్కునివుంటాయి * * * * అతను మింగుతున్న రాయితీల రసగుల్లల్ని మనం ద్వెషిస్తుంటే మనం ఆరగించేసిన పంచామౄతాల వూసు మనమే మర్చిపోతే సమాజాన్ని శల్య పరీక్షకు నిలబెట్టాల్సిందే
"ఒక్కోసారి అనిపిస్తుంది" నేను కౄంగి పోతున్నప్పుడల్లా నింగినే చూస్తుంటాను అలసిపోయినప్పుడల్లా అందని గమ్యాన్నే గురిపెడతాను ఓడిపోతున్నప్పుడల్లా గెలుపుకై పరిగెడతాను నాలోని విశ్వాసం   విన్నుత్న ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుంది గుండెలు పగులుతున్నప్పుడల్లా మొఖం మహా గాంభిర్యాన్నే చోటు చేసుకుంటుంది హ్రుదయం విలపిస్తున్నా పెదాలు చిరునవ్వునే చిందిస్తాయి ప్రపంచం వెక్కిరిస్తున్నప్పుడు చిన్నబుచ్చుకున్న నామనసు విచ్చిన్నమౌతున్న మానవసంభందాల్లోని పెద్దరికాన్నే వెతుకుతుంటుంది ఓక్కో సారి అనిపిస్తుంది కన్నీటిని అదిమి పెట్టుకోటం కంటే కన్నీరై జారిపోతె ఎంత బావుణ్ణో నామనసును హత్య చేస్తూ నన్ను ప్రాణాలతొ మిగిలిస్తున్న ప్రపంచమా ..నీకో సలాం   [ఆంద్రభూమి వార పత్రికలొ ప్రచురితమైన నా పాత కవిత ] 
Image
నిరసన జెండా నువొక్కోసారి అనేవాడివి గుర్తుందా   వొక్కసారి చరిత్రను చూసుకోమని నిజమే ఆ చరిత్రలొ నేనుండను అది నువ్వు రాసిందే కద గతంకన్నా వేదనా భరిత వర్తమానమే నాదయినప్పుదు కళ్ల ముందే కుల్చేసిన విషాదాన్ని   గుందెల్లొ మోస్థున్నొడ్ని నువ్వు చేసిన సామూహిక   నరమేధం లో గుర్తుతెలీని శవాన్ని నువ్వు కూలుస్తున్నప్పుదు కుమిలి పోతూ నువ్వు నిర్మిస్తున్నప్పుదల్లా సమాధినవుతూ నువ్వు చెర్చినప్పుదల్లా చెర్చబదుతూ నువ్వు చంపినప్పుదల్లా చంపబదుతూ యెవ్వడో యెక్కడో పేల్చిన బాంబుకు నేన్నిక్కద వొణికిపోతూ వంద కోట్ల ప్రజల సాక్షిగా వొంటరి సమూహంలో వేటాడ బడ్డ తల్లి కడుపులో పిండాన్ని నేను నువ్వు చూసే అనుమానపు చూపులతో అవమాన పడుతూ రోజీ కోసం రోజూ భూమ్యాకాశాల్ని ఏకం చేసె సందు చివరి గరీబు సాయిబున్నేను నా తెల్ల జుబ్బాలొ నువ్వు తీవ్రవాదాన్ని వెతికినంత తేలిగ్గా నన్ను చంపింది నువ్వొ నీ రంగు పులుముకున్న రాజ్యమో తెలుసుకోలేనోడ్ని నిత్య గాయాలరక్త ప్రవాహాన్ని ఫుట్టిన భూమ్మీదే పరాయిని నువ్వు రాల్చేసిన మినార్ క్రింద   పదినలిగిన పావురాయిని నేనిప్పుదు మా ఇస్లాంపేట ఇరుకు సందులొ యెగరేయ బడ్డ నిలువెత్తు నిరసన జెండాని నువ్...
Image
*సముద్ర ఘొష * ఉప్పెనంత ఉప్పుసముద్రం సాక్షిగా మేం తీరప్రాంతాన  బ్రతుకుల్ని తల్లార్చుకుంటున్నం ఇక్కడ మాగొంతుకలు దాహానికి చిరునామాలవుతున్నాయి బీటలు వారిన భూములు  చిద్రమవుతున్న జీవితాలకు ఆనవాళ్ళవుతున్నాయి లాకౌట్ల బ్లొఔట్లు మాగుండెల్ని పేల్చేస్తుంటె దీనంగా వలస పక్షులమౌతున్నాం హలం దిగని పొలం మీద కార్చటానికి కన్నిళ్ళు సైతం ఇంకి పోతుంటె మా గొడ్లను కబేళాలకు మా గొంతుకల్ని ఉరితాళ్ళకు ఊపిర్లొదులుకుంటున్నాం నిండామునిగోసారి నీటి చుక్కాలేక మరొసారి అతివృష్టి కి అనావృష్టి కి మధ్య అస్థిపంజరాలమై అస్థిత్వాన్ని కోల్పొతుంటె ఇది కడుపు నిండిన కోస్తా ఎలాఅవుతుంది మా ఆకలి ప్రేగుల అల్సర్ త్రేపులు మీకు పంచభక్ష పరమాన్నాల గ్యాస్ లా అనిపిస్తుందేమో దూరాన్నుంచి సముద్రం ప్రశాంతంగాను ఎండమావులు సెలయేరుల్లాను కనిపిస్తున్నాయేమో ఆకలి నేపథ్యంలో మమ్మల్ని మేం మరచిపొయాం అవసరం నేపథ్యంలొ మీకు మీరు తెలుసు కున్నారు మీ నినాదాల హొరులో మమ్మల్ని మీరు నిందిస్తే మా ఆకలికూడ మిమ్మల్ని నిలదీస్తుంది