Nabi Kareem Khan బహుశా" నబి కె ఖాన్ మనం ఎప్పుదైతే అతన్నో అంటరానివాణ్ణి చేసి ఊరవతల విసిరేశామో అప్పుడే పునరాలొచించుకోవల్సింది మనం ఎప్పుడైతే అతన్లో అస్పౄస్యపు గాయాల్ని రేపి వివక్ష విత్తుల్ని నాటామో బహుశా అప్పుడు మొలకెత్తిన హరితమే హరిజనం * * * అగ్రహారపు అరుగుల మీద రచ్చబండ రాజకీయంలో అతన్నో పావునుచేసి మనం ప్రకటించిన పంచముడుకదా అచారాల్ని మనం శాసించి అపచారాల్ని అతని ముఖాన పులిమినప్పుడు బహుశా అతను నిద్రిస్తూలేడేమో తనమొలకు కట్టిన తాటాకు చప్పుళ్ళు తనకు ప్రతీక్షణం పారాహుషార్ పలికేవనుకుంటా * * * * ఊరుమ్మడి బావి దగ్గర ఊరే నిళ్ళ సవ్వడిని సైతం మనం చూడనివ్వని చండాలుడు కదా అప్పుడు చెమ్మగిళ్ళిన కళ్ళే చైతన్యాన్ని వెతుక్కునివుంటాయి * * * * అతను మింగుతున్న రాయితీల రసగుల్లల్ని మనం ద్వెషిస్తుంటే మనం ఆరగించేసిన పంచామౄతాల వూసు మనమే మర్చిపోతే సమాజాన్ని శల్య పరీక్షకు నిలబెట్టాల్సిందే
Posts
Showing posts from March, 2014
- Get link
- X
- Other Apps
"ఒక్కోసారి అనిపిస్తుంది" నేను కౄంగి పోతున్నప్పుడల్లా నింగినే చూస్తుంటాను అలసిపోయినప్పుడల్లా అందని గమ్యాన్నే గురిపెడతాను ఓడిపోతున్నప్పుడల్లా గెలుపుకై పరిగెడతాను నాలోని విశ్వాసం విన్నుత్న ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుంది గుండెలు పగులుతున్నప్పుడల్లా మొఖం మహా గాంభిర్యాన్నే చోటు చేసుకుంటుంది హ్రుదయం విలపిస్తున్నా పెదాలు చిరునవ్వునే చిందిస్తాయి ప్రపంచం వెక్కిరిస్తున్నప్పుడు చిన్నబుచ్చుకున్న నామనసు విచ్చిన్నమౌతున్న మానవసంభందాల్లోని పెద్దరికాన్నే వెతుకుతుంటుంది ఓక్కో సారి అనిపిస్తుంది కన్నీటిని అదిమి పెట్టుకోటం కంటే కన్నీరై జారిపోతె ఎంత బావుణ్ణో నామనసును హత్య చేస్తూ నన్ను ప్రాణాలతొ మిగిలిస్తున్న ప్రపంచమా ..నీకో సలాం [ఆంద్రభూమి వార పత్రికలొ ప్రచురితమైన నా పాత కవిత ]