ఆజాదీ
నేను తూటాకు గురిపెట్టిన విసుర్రాయిని స్వప్నిస్తాను అణచివేసే రాజ్యంపై ఆజాదీకోసం ఎత్తిన పిడికిళ్లను స్వాగతిస్తాను పుట్టిన భూమ్మీద ఆజాదీ నిషేదించబడ్డచోట నినాదాలై మొలకెత్తే నిరసన గేయాలకు నేనూ కోరస్ గొంతుకనవుతాను ఒక్కోసారి తత్వం ఇంకోసారి మతం ఇప్పుడు నీలా ప్రాంతం మనుషుల్ని వేరుచేసి దశాబ్దాలుగా కొనసాగే రక్తసిక్త సందర్బంలో కొన్ని వీరోచిత గాథల్ని రేపటి తరానికి కథలుగా చెప్పాలనుకుంటాను ఓడిపోతున్న జట్టుపక్షాన మాట్లాడకపోతే ఒరిగిపోతున్న జాతిపక్షాన బాధని ప్రకటింకపోతే నీ మరణంకూడా వాడ్ని మనిషిగా మార్చలేని సంకల్పిత మౌనం బద్దలయ్యేలా నేను తుపాకీ తూటాకు గురిపెట్టిన విసుర్రాయినే స్వప్నిస్తాను Nabi Kareem Khan