*సముద్ర ఘొష *
ఉప్పెనంత ఉప్పుసముద్రం సాక్షిగా
మేం తీరప్రాంతాన
బ్రతుకుల్ని తల్లార్చుకుంటున్నం
ఇక్కడ మాగొంతుకలు దాహానికి చిరునామాలవుతున్నాయి
బీటలు వారిన భూములు
చిద్రమవుతున్న జీవితాలకు ఆనవాళ్ళవుతున్నాయి
లాకౌట్ల బ్లొఔట్లు
మాగుండెల్ని పేల్చేస్తుంటె
దీనంగా వలస పక్షులమౌతున్నాం
హలం దిగని పొలం మీద
కార్చటానికి కన్నిళ్ళు సైతం ఇంకి పోతుంటె
మా గొడ్లను కబేళాలకు
మా గొంతుకల్ని ఉరితాళ్ళకు ఊపిర్లొదులుకుంటున్నాం
నిండామునిగోసారి
నీటి చుక్కాలేక మరొసారి
అతివృష్టి కి
అనావృష్టి కి మధ్య
అస్థిపంజరాలమై అస్థిత్వాన్ని కోల్పొతుంటె
ఇది కడుపు నిండిన కోస్తా ఎలాఅవుతుంది
మా ఆకలి ప్రేగుల అల్సర్ త్రేపులు
మీకు పంచభక్ష పరమాన్నాల గ్యాస్ లా అనిపిస్తుందేమో
దూరాన్నుంచి
సముద్రం ప్రశాంతంగాను
ఎండమావులు సెలయేరుల్లాను
కనిపిస్తున్నాయేమో
ఆకలి నేపథ్యంలో
మమ్మల్ని మేం మరచిపొయాం
అవసరం నేపథ్యంలొ
మీకు మీరు తెలుసు కున్నారు
మీ నినాదాల హొరులో
మమ్మల్ని మీరు నిందిస్తే
మా ఆకలికూడ మిమ్మల్ని నిలదీస్తుంది

Comments
Post a Comment