నిరసన జెండా


నువొక్కోసారి అనేవాడివి గుర్తుందా 
వొక్కసారి చరిత్రను చూసుకోమని
నిజమే ఆ చరిత్రలొ నేనుండను
అది నువ్వు రాసిందే కద

గతంకన్నా వేదనా భరిత వర్తమానమే నాదయినప్పుదు
కళ్ల ముందే కుల్చేసిన విషాదాన్ని 
గుందెల్లొ మోస్థున్నొడ్ని
నువ్వు చేసిన సామూహిక 
నరమేధం లో గుర్తుతెలీని శవాన్ని

నువ్వు కూలుస్తున్నప్పుదు కుమిలి పోతూ
నువ్వు నిర్మిస్తున్నప్పుదల్లా సమాధినవుతూ
నువ్వు చెర్చినప్పుదల్లా చెర్చబదుతూ
నువ్వు చంపినప్పుదల్లా చంపబదుతూ

యెవ్వడో యెక్కడో పేల్చిన బాంబుకు
నేన్నిక్కద వొణికిపోతూ
వంద కోట్ల ప్రజల సాక్షిగా
వొంటరి సమూహంలో వేటాడ బడ్డ
తల్లి కడుపులో పిండాన్ని నేను

నువ్వు చూసే అనుమానపు చూపులతో
అవమాన పడుతూ
రోజీ కోసం రోజూ భూమ్యాకాశాల్ని
ఏకం చేసె సందు చివరి గరీబు సాయిబున్నేను
నా తెల్ల జుబ్బాలొ నువ్వు తీవ్రవాదాన్ని
వెతికినంత తేలిగ్గా
నన్ను చంపింది నువ్వొ
నీ రంగు పులుముకున్న రాజ్యమో తెలుసుకోలేనోడ్ని

నిత్య గాయాలరక్త ప్రవాహాన్ని
ఫుట్టిన భూమ్మీదే పరాయిని
నువ్వు రాల్చేసిన మినార్ క్రింద 
పదినలిగిన పావురాయిని

నేనిప్పుదు
మా ఇస్లాంపేట ఇరుకు సందులొ
యెగరేయ బడ్డ నిలువెత్తు నిరసన జెండాని
నువ్వు ద్వంసం చేస్తున్నప్పుడు
విద్వంసం కాబడ్డ భారత సమభావాన్ని

నేనీ దేశపు మట్టిని గుందెలకు హత్తుకున్న 
సిసలైన దేస భక్తుడ్ని

NABI K KHAN
ONgole

Comments