
బహుశా"
నబి కె ఖాన్
మనం ఎప్పుదైతే
అతన్నో అంటరానివాణ్ణి చేసి
ఊరవతల విసిరేశామో
అప్పుడే పునరాలొచించుకోవల్సింది
మనం ఎప్పుడైతే
అతన్లో అస్పౄస్యపు గాయాల్ని రేపి
వివక్ష విత్తుల్ని నాటామో
బహుశా
అప్పుడు మొలకెత్తిన
హరితమే హరిజనం
* * *
అగ్రహారపు అరుగుల మీద
రచ్చబండ రాజకీయంలో
అతన్నో పావునుచేసి
మనం ప్రకటించిన పంచముడుకదా
అచారాల్ని మనం శాసించి అపచారాల్ని
అతని ముఖాన పులిమినప్పుడు
బహుశా
అతను నిద్రిస్తూలేడేమో
తనమొలకు కట్టిన తాటాకు చప్పుళ్ళు
తనకు ప్రతీక్షణం
పారాహుషార్ పలికేవనుకుంటా
* * * *
ఊరుమ్మడి బావి దగ్గర
ఊరే నిళ్ళ సవ్వడిని సైతం
మనం చూడనివ్వని చండాలుడు కదా
అప్పుడు చెమ్మగిళ్ళిన కళ్ళే
చైతన్యాన్ని వెతుక్కునివుంటాయి
* * * *
అతను మింగుతున్న రాయితీల రసగుల్లల్ని
మనం ద్వెషిస్తుంటే
మనం ఆరగించేసిన పంచామౄతాల వూసు
మనమే మర్చిపోతే
సమాజాన్ని శల్య పరీక్షకు నిలబెట్టాల్సిందే
నబి కె ఖాన్
మనం ఎప్పుదైతే
అతన్నో అంటరానివాణ్ణి చేసి
ఊరవతల విసిరేశామో
అప్పుడే పునరాలొచించుకోవల్సింది
మనం ఎప్పుడైతే
అతన్లో అస్పౄస్యపు గాయాల్ని రేపి
వివక్ష విత్తుల్ని నాటామో
బహుశా
అప్పుడు మొలకెత్తిన
హరితమే హరిజనం
* * *
అగ్రహారపు అరుగుల మీద
రచ్చబండ రాజకీయంలో
అతన్నో పావునుచేసి
మనం ప్రకటించిన పంచముడుకదా
అచారాల్ని మనం శాసించి అపచారాల్ని
అతని ముఖాన పులిమినప్పుడు
బహుశా
అతను నిద్రిస్తూలేడేమో
తనమొలకు కట్టిన తాటాకు చప్పుళ్ళు
తనకు ప్రతీక్షణం
పారాహుషార్ పలికేవనుకుంటా
* * * *
ఊరుమ్మడి బావి దగ్గర
ఊరే నిళ్ళ సవ్వడిని సైతం
మనం చూడనివ్వని చండాలుడు కదా
అప్పుడు చెమ్మగిళ్ళిన కళ్ళే
చైతన్యాన్ని వెతుక్కునివుంటాయి
* * * *
అతను మింగుతున్న రాయితీల రసగుల్లల్ని
మనం ద్వెషిస్తుంటే
మనం ఆరగించేసిన పంచామౄతాల వూసు
మనమే మర్చిపోతే
సమాజాన్ని శల్య పరీక్షకు నిలబెట్టాల్సిందే

Comments
Post a Comment