"ఒక్కోసారి అనిపిస్తుంది"

నేను కౄంగి పోతున్నప్పుడల్లా
నింగినే చూస్తుంటాను

అలసిపోయినప్పుడల్లా
అందని గమ్యాన్నే గురిపెడతాను


ఓడిపోతున్నప్పుడల్లా
గెలుపుకై పరిగెడతాను

నాలోని విశ్వాసం  
విన్నుత్న ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుంది

గుండెలు పగులుతున్నప్పుడల్లా
మొఖం మహా గాంభిర్యాన్నే చోటు చేసుకుంటుంది

హ్రుదయం విలపిస్తున్నా
పెదాలు చిరునవ్వునే చిందిస్తాయి

ప్రపంచం వెక్కిరిస్తున్నప్పుడు
చిన్నబుచ్చుకున్న నామనసు
విచ్చిన్నమౌతున్న మానవసంభందాల్లోని
పెద్దరికాన్నే వెతుకుతుంటుంది

ఓక్కో సారి అనిపిస్తుంది
కన్నీటిని అదిమి పెట్టుకోటం కంటే
కన్నీరై జారిపోతె ఎంత బావుణ్ణో

నామనసును హత్య చేస్తూ
నన్ను ప్రాణాలతొ మిగిలిస్తున్న
ప్రపంచమా ..నీకో సలాం
 
[ఆంద్రభూమి వార పత్రికలొ ప్రచురితమైన నా పాత కవిత ] 

Comments